ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. భారీ సైజ్‌లో ఉన్న కొండ చిలువ జనావాసల్లో హల్‌చల్ చేసింది. దీంతో అందరూ పరుగులు తీశారు. చివరకు స్నాక్ క్యాచర్ దానిని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజ పల్లి గ్రామం వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు.