ప్రస్తుతం యువత రీల్స్ వ్యామోహంలో ఉన్నారు. అందులో భాగంగానే రకరకాల పద్ధతుల్లో రీల్స్ చేసి ఫేమస్ అవుదామని చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఆల్ఫా-2లో ఓ యువకుడు అల్లు అర్జున్ గంగమ్మ వేషంతో వీధుల్లో తిరుగుతున్నాడు. చీర కట్టుకుని, అమ్మవారి అవతారంలా అలంకరించుకుని అచ్చం సినిమాలో హీరోలా తయారయ్యి రీల్స్ చేస్తున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న ఆ యువకుడిని ఎవరైనా పలకరిస్తే.. తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ హీరోలా పోజు కొడుతున్నాడు.