మహా కుంభమేళాకు ఒకే రోజు 6 కోట్లకుపైగా భక్తులు

ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. జనవరి 29 బుధవారం మౌని అమావాస్య ప్రభావంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది.