తెలంగాణలో సోనియా పోటీ..! | Lok Sabha Elections 2024 - TV9

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది. గతంలో ఇంధిరా గాంధీ మాదిరిగా ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియాగాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్‌ తో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవొచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆశిస్తున్నారు.