వామ్మో.. రాత్రి వేళ ఒక్కసారిగా పక్కకి ఒరిగిన రెండు భవనాలు..

విశాఖలో ఐదంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. వెలంపేట, పూల వీధిలో పక్క పక్కనే ఉన్న రెండు భవనాలు పక్కకి ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలంపేట రాత్రి ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో హుటాహుటిన ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు.