తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు

తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) ఏర్పాటు చేశామని TDCA ఛైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో క్రికెట్‌ మౌళిక సదుపాయాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు కనీసం రాష్ర్ట స్థాయి పోటీలకు సైతం దూరమయ్యే స్థితిలో ఉన్నారంటూ తెలిపాడు.