టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వై నాట్ 175 అంటూ ముందుకువెళ్తున్నారు. అన్ని సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఇన్‌ఛార్జులను ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ V.V.వినాయక్ వైసీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.