అందమైన, అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక నెమలి యోగా చేస్తున్న మహిళ ముందు అకస్మాత్తుగా వచ్చి వాలింది. అంతేకాదు.. ఆమె ఎదురుగా ఆ నెమలి పురివిప్పి తిరుగుతూ అందంగా ఆడసాగింది.. ఈ అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకర్షిస్తుంది. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.