అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నారు ఐటిడిఏ అధికారులు. అడ్వెంచర్ టూరిజంను పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పాడేరుకు చెందిన సంతోష్ అనే యువకుడు పారా మోటార్ రైడింగ్, ఈగల్ ఫ్లం కి అనుమతి పొందాడు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా అనుమైన ప్రాంతాలను పరిశీలించారు ఐటీడీఏ పీవో అభిషేక్. కొండల నడుమ సుందర ప్రదేశాలు చూస్తూ పారాగ్ రైడింగ్ చేసే అవకాశాలని పరిశీలిస్తున్నారు.