గోదావరి ఒడ్డున కూలిన సినీ వృక్షాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం

ఏదైనా ఒక ఊరికి పేరు వచ్చిందంటే వెనుక ఓ కథ ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చెట్టంత ఎత్తు ఎదిగి ఉండాలి... కానీ కుమారదేవం గ్రామానికి ఓ చెట్టే పేరు తెచ్చిపెట్టింది.