శక్తిపీఠము జ్యోతిర్లింగము ఒకే చోట కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి పట్ల ఎన్నారైలు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. హుండీ లెక్కింపులో విదేశాల కరెన్సీ పెద్ద ఎత్తున ఉండటం ఇందుకు నిదర్శనం. అమెరికా, సింగపూర్ కెనడా, న్యూజిలాండ్, ఖతార్, యూరప్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్, ఒమన్.. తదితర అనేక దేశాల నుంచి ఆయా కరెన్సీ మల్లన్న హుండీలో వస్తుండటం పట్ల ఆలయ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు