రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది.