రోజు ఉదయం శ్రీకామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామి సుప్రభాత సేవతో పూజలు మొదలై తదనంతరం విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చన, మహా మంగళ హారతులు, సహస్ర నామార్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మహా నివేదన, మంత్ర పుష్ప సేవలు జరగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం ఈ పది రోజు నిర్వహించనున్నారు.