పాములు పాకుతూ ఉంటాయి.. కానీ ఎగరడం ఎక్కడైనా చూసారా..? చూసి ఉండొచ్చు... ఎక్కడో టీవీలోనో.. సినిమాల్లోనో.. కానీ అలా ఎగిరే స్నేక్ డైరెక్ట్‌గా మీ కళ్ల ముందు కనిపిస్తే..! అది కూడా ఎన్నడూ చూడని విధంగా శరీరంపై నలుపు, ఎరుపు, గోల్డ్ రంగుల రింగులుగా చారలతో అందంగా కనిపిస్తే..! ఒక క్షణానికి కాస్త వింతగా అనిపించినా.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే అది సర్పం కదా..! అదే పరిస్థితి ఎదురయింది విశాఖలో ఓ కుటుంబానికి. అరుదైన ఆ సర్పం ఆ కుటుంబాన్ని వణికించింది.