మైనర్ బాలికను కాల్చి బూడిద చేసిన బంధువులు..!

అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కనిపించికుండా పోయిన మైనర్ బాలికను వెతికి మరీ తీసుకువచ్చారు పోలీసులు. ఇంటికి చేరిన బాలిక రెండు రోజులకే అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు దహనసంస్కారాలు చేశారు. అయితే ఇది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.