అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం

కాటారం మండలం గంగాపురి - మల్లారం గ్రామాల మధ్యలోని అలుగు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రాత్రి గుండ్రాత్‌పల్లి నుండి దామరకుంటకు వెళ్తున్న బొలేరో వాహనం అలుగు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. బొలేరో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.