అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో చిక్కుకున్న నాలుగేళ్ల బాలుడు..!

నాలుగేళ్ల పిల్లాడు.. కావాలని వెళ్లాడో.. తెలియకుండా వెళ్లాడో తెలియదు. మొత్తానికి లిఫ్ట్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయాడు. అంతే.. అక్కడ ఉన్న వారికి ముచ్చెమటలు పట్టాయి. లోపల ఉన్న పిల్లాడికి ఏమౌతుందో తెలియదు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో DRF వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఘటన హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకుంది.