ఏకంగా వంట గదిలోకి దూరిన భారీ నాగుపాము..!

పాములు సాధారణంగా ఇంటి పరిసరాలలో, లేదా అడవుల్లో గానీ, పుట్టల్లో కానీ కనపడుతుంటాయి. కానీ ఏకంగా వంట గదిలో ప్రత్యక్షమైంది ఓ నాగు పాము. పడగ విప్పి బుసలు గొట్టింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో వెలుగు చూసింది. అశ్వారావుపేటలో శనివారం(ఆగస్ట్ 24) సాయంత్రం సమయంలో వంట చేసేందుకు కిచెన్‌లోకి వెళ్లింది ఓ ఇల్లాలు. ఇంతలో వింత శబ్ధం వినిపించడంతో లేటు వేసి చూసింది. మహిళ గ్యాస్ పొయ్యి వద్ద పండగ విప్పిన నాగు పాము చూసి భయాందోళనకు గురి అయ్యింది. వెంటనే తేరుకుని భయపడి కేకలు వేస్తూ బయటకి పరుగులు తీసింది. ఈ అరుపులు విన్న స్థానికులు చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. అతను వచ్చి ఆ నాగుపాము ను పట్టుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.