2 నెలల తరువాత సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు.. మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు..

రెండు నెలల పాటు వేటకు మత్స్యకారులు విరామం ఇచ్చారు. సాగరంలోకి వెళ్లకుండానే జీవనాన్ని సాగించారు. చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసే సమయంలో వేట సాగించడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందన్న ఆలోచనతో మే, జూన్ నెలల్లో చేపల వేటకు ప్రభుత్వాలే విరామం ప్రకటిస్తున్నాయి.