ఏపీ విభజన హామీలపై కేంద్ర హోం శాఖ సమీక్ష - Tv9

ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై కేంద్ర హోం శాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ విభజన జరిగి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇంకా చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ గుర్తు చేస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.