ఎయిర్‌ఫోర్ట్‌లో అధికారుల తనిఖీలు..ఇరాకీ ప్రయాణికుడి బ్యాగ్‌లో తళుక్కుమన్న అనుమానాస్పద వస్తువులు..?

బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు గోల్డ్‌ స్మగ్లర్లు యద్ధేచ్చగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అడ్డదారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చాలా సార్లు బంగారం పట్టుబడిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఒక ఇరాకీ పౌరుడి వద్ద నుండి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.