అయోధ్య రామ మందిరం కోసం దశాబ్దాలుగా దీక్ష కర్ణాటకలోని హుబ్లీకి చెందిన నారాయణ్ జర్తర్‌ఘర్ అనే వ్యక్తి కూడా ఇలాంటి దీక్ష చేపట్టారు. నారాయణ్‌రు చిన్ననాటి నుంచే శ్రీరాముడంటే ఎంతో భక్తి. సీతా రాముల పట్ల అమితమైన భక్తిభావం ఉండేది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావాలని ఆయన కోరుకున్నారు. తన కోరికలు నెరవేరే వరకు జుట్టు కత్తిరించకోనని శపథం చేశారు. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు 1990లో అయోధ్యలో జరిగిన కరసేవ కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. ఎట్టకేలకు రామ మందిర నిర్మాణం పూరై రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.