రాష్ట్రంలో ఆక్రమణలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. అలాంటి వ్యవస్థతోనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు.