ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి.. రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు కాస్ట్‌లీ అయ్యాయని, ఎమ్మెల్యేగా నిలబడాలంటే రూ.30 కోట్లు కావాలన్నారు. అలాగే గెలిచిన తర్వాత మరో రూ. 40 కోట్లు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు.