బాపట్లలోని అమర్తలూరు మండలం ఇంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొలిమేరి తిరుపతయ్య (65) అనే వృద్దున్ని నాలుగు నెలలు క్రితం హత్యకు గురయ్యాడు. దీంతో అతని శవాన్ని మాయం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ స్థానికులు, బంధువులు ఆందోళనకు దిగారు. హత్యకు పాల్పడిన వ్యక్తులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వెలికి తీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటూరు లాకులు వద్ద రహదారిపై నిరసన కారులు షామియానా వేసి, ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిరసన కారులతో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.