కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు కన్నప్ప సినిమా సక్సెస్ కోసం హీరో మంచు విష్ణు ప్రసిద్ధ జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్నారు. అందులో భాగంగానే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా రాజగోపురం దగ్గరికి వచ్చిన హీరో మంచు విష్ణు ని ఆలయ మర్యాదలతో అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు.