రోడ్లపై తాగుబోతులు రెచ్చిపోతే తాట తీసుడే.. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసుల మాస్‌ వార్నింగ్!

నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ & డ్రైవ్, వాహన తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ శ్రీనివాస్ పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ నేతృత్వంలో దీనిని నిర్వహించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ జాని పాషా సబ్‌ఇన్‌స్పెక్టర్ మనసాతోపాటు మొత్తం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ సిబ్బంది కలిసి నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీ డ్రైవ్ నిర్వహించారు.