హైడ్రా విషయంలో బీజేపీ యాజ్‌యూజ్‌వల్ పార్టీ మార్క్ చూపించింది. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులనే కూల్చుతున్నారు అంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింల ఆస్తుల జోలికి వెళ్లే దమ్ము లేదా, ఎవరు ఆపుతున్నారంటూ మహేశ్వర్‌రెడ్డి హైడ్ర తీరుపై మండిపడ్డారు. రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా, రాజకీయ నాయకుడా? ఆసక్తి ఉంటే ఖాకీ వదలి, ఖద్దర్ వేసుకోవాలంటూ హితవు పలికారు మహేశ్వర్ రెడ్డి.