మా వాటా మాకు ఇస్తే చాలు Ambati Rambabu - Tv9

మా వాటా మాకు ఇస్తే చాలు-Ambati Rambabu మా వాటా నీళ్లను ధర్మబద్ధంగా మేం తీసుకుంటే అభ్యంతరమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం 13 గేటు వరకు ఉన్న భూభాగం ఏపీదేనని, గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల దాన్ని తెలంగాణ ఆక్రమించిందని ఆరోపించారు. ఏపీ భూభాగంలో తెలంగాణ పోలీసుల చెక్ పోస్టులు పెడితే ఎందుకు ఊరుకోవాలన్నారు. చట్ట ప్రకారమే మా భూభాగంలోకి మేం వెళ్లి మాకు రావాల్సిన నీటిని మేం విడుదల చేసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలతో తమకెలాంటి సంబంధం లేదని, అక్కడ ఎవరి ప్రభుత్వం వచ్చినా వారితో సత్సంబంధాలు నెరపడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ప్రభుత్వమైనా ఏపీ హక్కుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అంబటి తేల్చి చెప్పారు.