కలచివేస్తున్న యువ జర్నలిస్ట్ బలవన్మరణం..! వరంగల్‌లో యువ జర్నలిస్ట్ బలవన్మరణం యావత్ జర్నలిస్టు లోకాన్ని కలచివేసింది. జర్నలిజమే జీవితం.. ప్రశ్నించడమే తన నైజంగా ఎంచుకున్న ఆ యువ జర్నలిస్టు తన కూతురితో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆ జర్నలిస్టు బలవన్మరణం అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. చివరి దశలో కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి గూడు కూడా లేకపోవడం, ఇంటి యజమాని తన ఇంట్లో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పడం జర్నలిస్టుల హృదయాలను తల్లడిల్లిపోయేలా చేసింది.