కొంతమంది ఇక్కడున్న అహంకారులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. వాళ్ల నోట్ల కట్టలు హైదరాబాద్‌లో దొరుకుతున్నయ్. వాళ్లు ఏం మాట్లాడుతారు.. డబ్బు అహంకారంతోని బీఆర్ఎస్ పార్టీవోని అసెంబ్లీ గడప తొక్కనీయం అంటరు. అసెంబ్లీ కడప తొక్కనీయకపోవడానికి వీడెవడు..? నాకు అర్థం కాదు. అసెంబ్లీకి ఎవర్నీ పంపాలో నిర్ణయించేది మీరు కదా..? ఆ ఓటు మీ దగ్గర ఉంది కదా..? అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ది చెప్పాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.