అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించింది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ యాత్రకు జిల్లా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇందులో భాగంగా మేమంతా సిద్ధం సభతో జగన్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్.