ఆళ్లగడ్డలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్.. నిందితుడిని చూసి షాకైన ఖాకీలు!

ఆళ్లగడ్డ రూరల్ PS పరిధిలోని అహోబిలంలో ఈనెల 4 న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి, ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్సై నరసింహులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2003 లో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చెడు సావాసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నాడు.