నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్దులు , మహిళలనే టార్గెట్ గా చేసుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఆశలు కల్పిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ముచ్చటగా మూడు ఘటనలు చోటు చేసుకోవడం.. ఆ మూడు ఘటనల్లోను అత్యాసకు పోయి ఒంటి మీద నగలు కోల్పోవడం బాధితుల వంతైంది.