కొండలను గుట్టలను గుల్ల చేయటంతో పాటు, చెట్ల పొదలను తొలగించే జెసిబి ఇప్పుడు గణేశుడి గ్రామోత్సవం నిర్వహించింది. వినాయక నిమజ్జనానికి ఇలా వెరైటీగా జేసిబిని ఉపయోగించారు అక్కడి ప్రజలు. గణేష్ నవరాత్రులు కన్నుల పండగ నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించి గణేష్ ని నిమజ్జనం చేస్తారు. గణేష్ ని మజ్జనానికి తరలించడానికి వాహనాలను అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కానీ, ఖమ్మం జిల్లాలో మాత్రం వినూత్నం వినాయక నిమజ్జనం నిర్వహించారు.