తెలంగాణ నయాగరా.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

కుండపోత వర్షాలతో బోగత జలపాతానికి వరద పోటెత్తింది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది.. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాలలో జలకాలకు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి..