పాతబస్తీలో ఊడిపడిన మచిలీకమాన్‌ పెచ్చులు

హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. భారీ వర్షం కారణంగా పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్ సమీపంలోని మచ్లీ కమాన్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.