హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విషాదకర ఘటన. తల్లితో కలిసి జ్యువెలరీ షాపునకు వెళ్లిన రెండేళ్ల చిన్నారి సైనేడ్ పదార్థం నోటిలోకి వెళ్లడంతో అస్వస్థతకు గురై మరణించింది. చింతల్‌లోని షాపు వద్ద జరిగిన ఈ ఘటనలో నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.