వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గ్రౌండ్‌లో ఉన్న ఫ్యాన్స్ తో పాటుగా టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. అయితే తిరుపతి జిల్లాలో మాత్రం ఈ పరాజయాన్ని చూసి ఓ యువకుడి గుండె మాత్రం తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.