నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామం.. ప్రకృతి ఒడిలో గ్రామస్తుల జీవనం హాయిగా సాగిపోతున్నది.. ఈ క్రమంలో ఊరిలో జనం ఉన్నపళంగా ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు మృతి చెందగా, అతడి దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం రెండు నెలలుగా జరుగుతోంది. దీంతో ఎందుకు చనిపోతున్నారో తెలియకపోతే గ్రామస్తులు ఆందోళన చెందారు.