ఎన్నికల వేళ భారీగా గోవా మద్య పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టింది.