పవన్ కళ్యాణ్ Nda లో భాగస్వామి Kishan Reddy At Tv9political Conclave 2023 -Tv9

ఆంధ్ర లేదు.. తెలంగాణ లేదు.. అందరం ఒకటే.. మనందరం భారతీయులమేనన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు లేనేలేదన్న ఆయన.. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ శాఖ పెట్టారు. ఇంకా సెంటిమెంట్ ఏంటని ప్రశ్నించారు. జనసేన 2014 నుంచి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పవన్ 70 సీట్లలో నామినేషన్ వేస్తే.. తాము వెళ్లి మాట్లాడిన అనంతరం విత్ డ్రా చేసుకున్నారని.. ఆ తర్వాత బీజేపీకి మద్దతుగా జనసేన కేడర్ అంతా ప్రచారం కూడా చేశారన్నారు కిషన్ రెడ్డి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన 33 సీట్లకు అభ్యర్ధులకు ప్రకటిస్తే.. తాము సమావేశం అయిన అనంతరం 8 సీట్లకే పరిమితమయ్యారని.. పవన్ ఎన్డీఏకి పాత మిత్రుడేనని.. వారితోనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.