షాకులు, మలుపులు.. సర్పంచ్ ఎన్నికల్లో కామన్. కానీ ఇలాంటి సీన్ మాత్రం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. ఈ విషయం తెలియగానే ఎగిరి గంతేశాడు చంద్రశేఖర్ అనే యువకుడు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శ్రీజ అనే యువతిని ప్రేమించిన చంద్రశేఖర్ గౌడ్ ఆమెతో మధ్యాహ్నం నామినేషన్ వేయించాడు.