ఎమ్మెల్యేకే కారు గిఫ్ట్‌.. అభిమానం చాటుకున్న జనసైనికులు..!

ఎన్నికల సమయంలో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం, ఓట్లు వేయండయ్యా.. అంటూ ప్రజలను రిక్వెస్ట్ చేయటం ఇది సగటు పార్టీ కార్యకర్తలు పని అనుకుంటాం. కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్ద ఎత్తున హడావుడి ఉంటుంది. ఎమ్మెల్యే కారుతోపాటు, పక్కన పదుల సంఖ్యలో చోటా మూటా నాయకులు ఉంటారు. అలాంటిది మోటార్ సైకిల్‌పై నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేను చూసిన కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. ఏకంగా ఓ కారును ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు.