ఫైనాన్స్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే

ఫైనాన్స్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే, వాళ్ళు పెట్టే టార్చార్ మాములుగా ఉండదు..! ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేక, ఫైనాన్స్ ఏజెంట్ ముందే ఓ యువకుడు తన వద్ద ఉన్న బైక్‌ను తగలబెట్టేశాడు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుని ఓ టూవీలర్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈక్రమంలోనే ప్రతిసారి ఈఎంఐ డబ్బుల కోసం ఫైనాన్స్ ప్రతి నిధులు ఇంటికి రావడంతో మనోవేధనకు గురైన ఆ యువకుడు తన బైక్‌కు నిప్పంటించి దగ్ధం చేశాడు.