శ్రీశైలంలో శ్రీరామనవమి వేడుకలు.. కన్నులపండువగా రాములోరి కళ్యాణం

శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు, మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు