తిరుమల లడ్డూలో నెయ్యి నాణ్యతపై మొదలైన వివాదం, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. లడ్డూ నాణ్యత, నెయ్యి కల్తీ, టీటీడీ పవిత్రత, డిక్లరేషన్ ఇలా సాగిన రాజకీయ వివాదాలు.. జగన్ తిరుమల పర్యటనదాకా వచ్చాయి. ఈ క్రమంలో డిక్లరేషన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిన్నటి దాకా మాజీ సీఎం తిరుమల పర్యటన చుట్టూ తిరిగిన డిక్లరేషన్ ఇష్యూ.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటోందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది..