భర్త పక్కన ఉండగానే పరాయి స్త్రీపై చేయి వేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఇంకేముంది సదరు వ్యక్తికి భర్త చేతిలో చెప్పు దెబ్బలు తప్పలేదు. పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇది పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే జరిగింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.