కోనసీమ అల్లుడంటే అంతే మరి.. ఆషాడం అల్లుడికి 100 రకాల వంటలతో విందు..

కోనసీమ జిల్లా వాసులు అల్లుడి మర్యాదలు మాత్రం వెరీ వెరీ స్పెషల్. సంక్రాంతి పండగకు మాత్రమే కాదు ఆషాడ మాసం తర్వాత ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా ఆషాడం మాసం తర్వాత ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తారింట్లో జరిగిన మర్యాదలు పెట్టిన పిండి వంటలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.