షర్మిలపై విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రోజా స్పందించారు. 'ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదు. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరో.. వాటిని ఎవరు పరిష్కరించారో ప్రజలకు తెలుసు' అని పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు, ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగన్ అని తెలిపారు.